అమెరికాలో విదేశీ టెక్కీలకు ట్రంప్ సర్కార్ బిగ్ షాక్
ముఖ్యమైన పాయింట్స్:టీసీఎస్, ఇన్ఫోసిస్ సహా 8 దిగ్గజ ఐటీ కంపెనీలపై చర్యలు! వాషింగ్టన్: అమెరికాలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని భావిస్తున్న విదేశీ టెక్కీలకు, ముఖ్యంగా భారతీయ ఐటీ నిపుణులకు ట్రంప్ యంత్రాంగం మరో భారీ షాక్ ఇచ్చింది. విదేశీ ఉద్యోగులకు శాశ్వత నివాస హోదా కల్పించే ప్రక్రియలో కీలకమైన పర్మనెంట్ లేబర్ సర్టిఫికేషన్ (PLC) ను తాత్కాలికంగా సస్పెండ్ చేస్తూ US Department of Labor సంచలన నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయంగా పేరుపొందిన 8 ప్రముఖ ఐటీ సంస్థలపై ఈ సస్పెన్షన్ వేటు పడగా, ఇందులో భారతీయ ఐటీ దిగ్గజాలైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సీఎల్ కంపెనీలు కూడా ఉన్నాయి. ఇందుకు...