యూపీఐ లావాదేవీలపై ఎం‌డీఆర్ ఛార్జీల విధింపు వాయిదా?

ముఖ్యమైన పాయింట్స్:పండుగ వేళ వ్యాపారులకు బిగ్ రిలీఫ్! హైదరాబాద్ (న్యూస్ డెస్క్): డిజిటల్ చెల్లింపుల వినియోగదారులకు, వ్యాపారులకు ఉపశమనం కలిగించే ప్రచారం ఒకటి మొదలైంది. రూ.2,000 కంటే ఎక్కువ విలువైన లావాదేవీలపై ప్రతిపాదించిన 0.4 శాతం UPI MDR Charges (మర్చంట్ డిస్కౌంట్ రేట్) అమలు ప్రక్రియను వాయిదా వేసే యోచనలో అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ 15 నుంచే ఈ నూతన ఛార్జీలను అమల్లోకి తీసుకురావాలని తొలుత భావించినప్పటికీ, ప్రస్తుత పండుగ సీజన్ దృష్ట్యా దీనిపై National Payments Corporation of India (NPCI) ఇంకా ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని పరిశ్రమ వర్గాలు రాయిటర్స్‌కు తెలిపాయి. పండుగల వేళ చెల్లింపులకు అంతరాయం కలగకుండా.....