అమెరికాలో ఐటీ అనిశ్చితి.. భారత్‌కు స్వర్ణ అవకాశం
ముఖ్యమైన పాయింట్స్:స్వదేశానికి రండి - గ్లోబల్ టెక్ హబ్‌గా నిలబెడదాం గ్లోబల్ ఐటీ రంగంలో సంచలనాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అమెరికాలో ఉపాధి ఆధారిత గ్రీన్‌కార్డు ప్రక్రియలో అత్యంత కీలకమైన PERM Certification పై అక్కడి ప్రభుత్వం ఆంక్షలు విధించడం భారతీయ టెక్ నిపుణుల్లో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్‌సీఎల్ వంటి దిగ్గజ సంస్థల్లో H-1B Visa ప్రాతిపదికన పనిచేస్తున్న వేలాది మంది భారతీయుల భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. అయితే, ఈ సంక్షోభాన్ని ఆందోళనగా కాకుండా, దేశీయంగా ప్రపంచస్థాయి సాంకేతిక వ్యవస్థను నిర్మించుకునే గొప్ప అవకాశంగా మలుచుకోవాలని భారత పారిశ్రామిక, రాజకీయ రంగాధిపతులు పిలుపునిస్తున్నారు. ‘తిరిగి రండి.. స్వదేశాన్ని నిర్మిద్దాం’: శ్రీధర్...