22-ఎ, జీఓ 59 భూ సమస్యలపై ప్రభుత్వం కీలక నిర్ణయం
ముఖ్యమైన పాయింట్స్:నెల రోజుల్లో పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం: మంత్రి పొంగులేటి హైదరాబాద్ : రాష్ట్రంలో దశాబ్దాలుగా వేధిస్తున్న భూ సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. 22A Land Issues తో పాటు జీఓ 59 పెండింగ్ దరఖాస్తులను రాబోయే నెల రోజుల్లో పూర్తిగా పరిష్కరిస్తామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తూ ప్రభుత్వం మెమో నంబర్ 48030 ని విడుదల చేసినట్లు వెల్లడించారు. 500 చదరపు గజాల లోపు ఉన్న GO 59 Pending Applications నిబంధనల ప్రకారం...