స్థానిక పోరుకు సై: పంచాయతీల ఫలితాలు ఆ రోజే!

ముఖ్యమైన పాయింట్స్:రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం– ఒకే విడతలో పుర, నగర పాలక సమరం; రెండు దశల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ?– ముగిసిన వీడియో కాన్ఫరెన్స్; వివరాలు వెల్లడించిన SEC అనిల్‌చంద్ర పునేఠా అమరావతి : రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎన్నికల కమిషన్ కీలక వివరాలను వెల్లడించింది. మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీలకు ఒకే దశలో ఎన్నికలు పూర్తి చేయాలని నిర్ణయించినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) అనిల్‌చంద్ర పునేఠా తెలిపారు. కాగా, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను రెండు దశల్లో నిర్వహించే ప్రతిపాదనను పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. ఈ మేరక అన్ని జిల్లాల అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ఎస్ఈసీ...