సైబర్ మోసం బాధితుడికి ఊరట: ఎస్‌బీఐకి వినియోగదారుల కమిషన్ షాక్!

ముఖ్యమైన పాయింట్స్:ఖాతాదారునికి రూ.1.35 లక్షలు చెల్లించాలని ఆదేశం– కేవైసీ లింక్ మోసంలో మిగిలిన సొమ్ము, నష్టపరిహారంతో సహా ఇవ్వాలని తీర్పు– 45 రోజుల్లోగా చెల్లించకుంటే చర్యలు తప్పవని హెచ్చరిక తిరువనంతపురం: ఆన్‌లైన్ ఫ్రాడ్ (Cyber Fraud) బాధితుడికి కేరళలోని జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ బిగ్ రిలీఫ్ ఇచ్చింది. సైబర్ మోసానికి గురైన ఒక వినియోగదారునికి రూ.99,874ల మిగిలిన మొత్తంతో పాటు, పరిహారం కింద మరొక రూ.35,000 చెల్లించాలని ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)ను ఆదేశించింది. కేరళలోని పతనంతిట్టకు చెందిన ఒక దంపతులకు ఎస్‌బీఐలో సేవింగ్స్ ఖాతాతో పాటు రూ.10 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) ఉంది....