Loading Time...
Search
న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ
Install App

*బుల్లెట్ ట్రైన్ దీక్షలో కూర్చున్న రిటైర్డ్ ఉద్యోగులకు ఆర్యవైశ్య మిత్రుల సంఘీభావం*

Author
Posted By RK SAKSHI
| 16 Sep 2026, 08:03 PM | ఎడిటోరియల్ న్యూస్
*బుల్లెట్ ట్రైన్ దీక్షలో  కూర్చున్న రిటైర్డ్ ఉద్యోగులకు ఆర్యవైశ్య మిత్రుల సంఘీభావం*

సూర్యాపేట: గత 33 రోజులుగా సూర్యాపేట మీదుగా బుల్లెట్ ట్రైన్ నడపాలని కోరుతూ రిలే నిరాహార దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా బుధవారం ఈ రిలే నిరాహార దీక్షలో రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొనగా సూర్యాపేటకు చెందిన ఆర్యవైశ్య మిత్రులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య మిత్రులు తప్సీ గాంధీ,కలకోట లక్ష్మయ్య, చల్లా సత్యనారాయణ, శ్రీ వాసవి సేవా సమితి జిల్లా అధ్యక్షులు బచ్చు పురుషోత్తం మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా, చిరకాల కోరికగా సూర్యాపేటకు రైలు మార్గం పునరుద్దించాలనీ కోరుతూ ఆర్యవైశ్య ప్రముఖులు మంచాల రంగయ్య నేతృత్వంలో ఎంతోమంది నాయకులకు విన్నవించుకున్న కొందరి స్వార్థపూరిత ప్రయోజనాలతో రైలు మార్గం సూర్యాపేట మీదుగా పునర్దించకుండా ఇతర మార్గాల ద్వారా దారి మళ్లించి మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సూర్యాపేట నుండి రైలు మార్గం పునరుద్దించే వరకు ఈ రిలే నిరాహార దీక్షలకు ఆర్యవైశ్యుల మద్దతు ఉంటుందని తెలిపారు. ఈనెల 18 శుక్రవారం సూర్యాపేట బందులో భాగంగా పూర్తి మద్దతు ప్రకటించారు. 70 ఏళ్ల వయసులోనూ ప్రజల అవసరాల కొరకు దీక్షలో కూర్చున్న సీనియర్ సిటిజన్స్ కు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మిత్రులు ఉప్పలంచు కృష్ణ, నరేందర్, కొండ శ్రీనివాస్, నూనె సత్యనారాయణ తదితరులు ఉన్నారు.

అత్యధికంగా చదివినవి