Loading Time...
Search
న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ
Install App

ఐరోపాపై దాడి చేసే ఉద్దేశం లేదు: పుతిన్

Author
Posted By M TODAY NEWS
| 02 Oct 2026, 08:28 PM | INTERNATIONAL
ఐరోపాపై దాడి చేసే ఉద్దేశం లేదు: పుతిన్

ముఖ్యమైన పాయింట్స్:

  • సార్వభౌమాధికారానికి ముప్పు వస్తే తగిన బుద్ధి చెప్తాం | 'పాయింట్ ఆఫ్ నో రిటర్న్' దాటవద్దని హెచ్చరిక

మాస్కో: ఐరోపా దేశాలపై దాడి చేసే ఎలాంటి ఆలోచనా రష్యాకు లేదని, ప్రపంచ దేశాలతో శాంతియుత సహజీవనాన్నే తాము కోరుకుంటున్నామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పష్టం చేశారు. అయితే, తమ దేశ సార్వభౌమాధికారానికి, భద్రతకు భంగం వాటిల్లితే మాత్రం ఉపేక్షించేది లేదని, తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. మాస్కో వేదికగా జరిగిన ప్రతిష్టాత్మక Valdai Discussion Club సదస్సులో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుతం పెరుగుతున్న అంతర్జాతీయ ఉద్రిక్తతలపై పుతిన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే పరిస్థితులు ఎవరూ నియంత్రించలేని Point of No Return (తిరిగి రాలేని వినాశకర స్థాయి)కి చేరుకుంటాయని హెచ్చరించారు. పోలాండ్, లిథువేనియా దేశాల మధ్య ఉన్న రష్యా పశ్చిమ ఎక్స్‌క్లేవ్ 'కలినిన్‌గ్రాడ్' వ్యూహాత్మకంగా తమకు అత్యంత కీలకమైన ప్రాంతమని పేర్కొన్నారు. NATO సైనిక బలం రష్యా కంటే రెండింతలు పెద్దదని తమకు తెలుసని, అందుకే రష్యా తనకున్న సైనిక, అణ్వాయుధ సామర్థ్యంపై ఆధారపడాల్సి వస్తోందని వివరించారు. బ్రిటన్, ఫ్రాన్స్ వద్ద ఉన్న అణ్వాయుధ శక్తిపై తమకు స్పష్టమైన అవగాహన ఉందని, అయితే రష్యా వద్ద వాటి కంటే ఎంతో ఆధునికమైన ఆయుధ సంపత్తి ఉందని గుర్తుచేశారు.

గ్లోబల్ సవాళ్ల పరిష్కారానికి సరైన ఎజెండా ఖరారైతే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌లతో కలసి త్రైపాక్షిక చర్చల్లో పాల్గొనేందుకు తాను సిద్ధంగా ఉన్నానని పుతిన్ ప్రకటించారు. ఇక ఉక్రెయిన్ యుద్ధం గురించి మాట్లాడుతూ.. నల్లసముద్ర (Black Sea) ప్రాంతంలో దాడులను నిలిపివేసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. తమ చమురు శుద్ధి కర్మాగారాలపై ఉక్రెయిన్ జరిపిన దాడుల వల్ల రష్యా జీడీపీ (GDP) లో 1 శాతం నష్టం వాటిల్లిందని ఆయన వెల్లడించారు.

ఐరోపాపై దాడి చేసే ఉద్దేశం లేదు: పుతిన్ - Additional Image