Loading Time...
Search
న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ
Install App

రుషికొండ ప్యాలెస్ ఓ 'తెల్ల ఏనుగు'.. విశాఖ ప్రగతి అన్‌స్టాపబుల్

Author
Posted By M TODAY NEWS
| 20 Sep 2026, 03:14 PM | ANDHRA PRADESH
రుషికొండ ప్యాలెస్ ఓ 'తెల్ల ఏనుగు'.. విశాఖ ప్రగతి అన్‌స్టాపబుల్

ముఖ్యమైన పాయింట్స్:

  • భవనాల వినియోగంపై త్వరలోనే నిర్ణయం
  • రానున్న రోజుల్లో విశ్వనగరంగా విశాఖపట్నం
  • ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి కట్టుబడి ఉన్నాం
  • విశాఖ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

గత ప్రభుత్వం ప్రజా ధనాన్ని వృథా చేస్తూ రుషికొండపై నిర్మించిన విలాసవంతమైన ప్యాలెస్ నిర్వహణ.. ఓ 'తెల్ల ఏనుగు'ను మేపినట్లేనని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో విశాఖ ఒకటని, రానున్న రోజుల్లో ఇది విశ్వనగరంగా మారుతుందని ఆయన ఆకాంక్షించారు. విశాఖపట్నంలో జరిగిన సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు.

రాజుల కాలం నాటి పద్ధతిలో గత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రుషికొండపై విలాసవంతమైన భవనాలు నిర్మించారని, వాటిని ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదని చంద్రబాబు విమర్శించారు. సుమారు రూ.500 కోట్ల వ్యయంతో నిర్మించిన ఆ భవనాలను నిర్వహించడం అత్యంత భారమైన పని అన్నారు. వీటి వినియోగంపై ఇప్పటికే ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం పలుమార్లు చర్చలు జరిపిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. త్వరలోనే ఆ భవనాల వల్ల ప్రజలకు ప్రయోజనం చేకూరేలా తగిన నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.

విశ్వనగరంగా విశాఖ.. ఆదర్శంగా పరిశుభ్రత

ఇవి కూడా చదవండి

విశాఖ గ్రేట్ సిటీ అని కొనియాడిన ముఖ్యమంత్రి.. తిరుమలలో 89.4 శాతం పచ్చదనం ఉందని, అదే తరహాలో విశాఖలోనూ పచ్చదనాన్ని భారీగా పెంచాలని సూచించారు. పరిసరాల పరిశుభ్రతలో విశాఖ రాష్ట్రానికే ఆదర్శంగా నిలవాలన్నారు. నగర ప్రజలకు, ఇక్కడి పరిశ్రమలకు అవసరమైన నీటిని అందించే పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనని భరోసా ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు ద్వారా విశాఖ తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు. పోలవరం ఎడమ కాలువ ద్వారా అనకాపల్లికి గోదావరి జలాలను రప్పించి, అక్కడి నుంచి వంశధారతో అనుసంధానించడం ద్వారా యావత్ ఉత్తరాంధ్రను సస్యశ్యామలం చేస్తామని వివరించారు.

అభివృద్ధి ఇక అన్‌స్టాపబుల్

విశాఖ నగర అభివృద్ధి ఇకపై 'అన్‌స్టాపబుల్' అని చంద్రబాబు ఉద్ఘాటించారు. ఆంధ్రుల హక్కు అయిన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకునేందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని తెలిపారు. అలాగే, దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న విశాఖ రైల్వే జోన్ పనులు కూడా ప్రారంభమయ్యాయని గుర్తుచేశారు. విశాఖ సర్వతోముఖాభివృద్ధికి కూటమి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని, నగరం మరింతగా ప్రగతి బాటన నడుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.