Loading Time...
Search
న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ
Install App

డీజేలకు 'నో'.. ఉండిలో రఘురామ సంచలన నిర్ణయం

Author
Posted By M TODAY NEWS
| 20 Sep 2026, 07:03 PM | ANDHRA PRADESH
డీజేలకు 'నో'.. ఉండిలో రఘురామ సంచలన నిర్ణయం

ముఖ్యమైన పాయింట్స్:

  • నిర్వాహకులకు పత్రికా కథనంతో అవగాహన.. రాష్ట్రవ్యాప్తంగా మన్ననలు

రాజకీయాల్లో ఏ నిర్ణయం తీసుకున్నా అందులో తనదైన మార్క్ చూపించే ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు మరోసారి వార్తల్లో నిలిచారు. రాష్ట్రవ్యాప్తంగా వినాయక నిమజ్జనాల్లో డీజేల మోత మోగుతున్న వేళ, తన నియోజకవర్గంలో మాత్రం వాటిని నిషేధిస్తూ ఆయన తీసుకున్న నిర్ణయం సర్వత్రా ప్రశంసలు అందుకుంటోంది. డీజేల శబ్ద కాలుష్యంతో ప్రాణాలు పోతున్న నేపథ్యంలో ఆయన ఈ మేరకు కీలక అడుగు వేశారు.
పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో గణేశ్ నిమజ్జనాల సందర్భంగా డీజేల అనుమతి కోసం స్థానిక ఉత్సవ కమిటీ నిర్వాహకులు ఎమ్మెల్యే రఘురామను కలిశారు. అయితే వారికి అనుమతి ఇచ్చేందుకు నిరాకరించిన ఆయన.. నేరుగా ఓ దినపత్రికలో వచ్చిన కథనాన్ని వారి ముందు ఉంచారు. "డీజే సౌండ్స్‌కు ఆగిన గుండె" అనే శీర్షికతో ప్రచురితమైన ఆ వార్తను స్వయంగా వారితోనే చదివించారు. డీజేల వల్ల సంభవిస్తున్న ప్రాణనష్టాన్ని గ్రహించిన నిర్వాహకులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంటనే తమ ఆలోచన మార్చుకుని, డీజేలు లేకుండానే భక్తిశ్రద్ధలతో సంప్రదాయబద్ధంగా వినాయక నిమజ్జనం చేసుకుంటామని ఎమ్మెల్యేకు మాట ఇచ్చారు. దీనిపై హర్షం వ్యక్తం చేసిన రఘురామ.. శబ్ద కాలుష్యంతో ఎంతోమంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారని, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఉత్సవాలు నిర్వహించుకోవాలని వారికి హితవు పలికి పంపారు.

ఆంక్షల సడలింపు వేళ.. ఆదర్శ నిర్ణయం

గణేశ్ ఉత్సవాల్లో డీజేల వినియోగంపై ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. హైదరాబాద్‌లో డీజేలపై పోలీసులు ఇప్పటికే కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఏపీలో కూడా హోంమంత్రి అనిత ఆదేశాలతో తొలుత డీజేలపై పోలీసులు ఆంక్షలు విధించారు. అయితే ఆ తర్వాత మంత్రి నారా లోకేష్ జోక్యం చేసుకోవడంతో ఆ ఆదేశాలను ఉపసంహరించుకున్నారు. ఫలితంగా ఏపీ అంతటా నిమజ్జనాల్లో డీజేల శబ్ద హోరు కొనసాగుతోంది. ఇలాంటి తరుణంలో, ప్రజల ఆరోగ్యమే పరమావధిగా భావించి డీజేలను కట్టడి చేస్తూ ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు తీసుకున్న నిర్ణయం పట్ల మేధావులు, సామాన్య ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది.

ఇవి కూడా చదవండి