Loading Time...
Search
న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ
Install App

గూండాయిజం చేస్తే ఉపేక్షించేది లేదు: సీఎం చంద్రబాబు

Author
Posted By M TODAY NEWS
| 21 Sep 2026, 05:54 PM | ANDHRA PRADESH
గూండాయిజం చేస్తే ఉపేక్షించేది లేదు: సీఎం చంద్రబాబు

ముఖ్యమైన పాయింట్స్:

  • స్పోర్ట్స్ కోటా టీచర్లపై దాడి ఘటనపై ముఖ్యమంత్రి సీరియస్
  • నారావారిపల్లె జన్మనిస్తే.. కుప్పం నాకు రాజకీయ జీవితాన్ని ఇచ్చింది
  • డీఎస్సీ అంటేనే టీడీపీ.. అడ్డంకులు దాటి 16వేల పోస్టుల భర్తీ
  • 'స్వర్ణ కుప్పం' బహిరంగ సభలో సీఎం ఉద్వేగభరిత ప్రసంగం

కుప్పం: గురువులపై దాడులకు తెగబడితే ఉపేక్షించే ప్రసక్తే లేదని, గూండాయిజం చేసే వారి తోకలు కత్తిరిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించిన ఆయన.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన 'స్వర్ణ కుప్పం' బహిరంగ సభలో ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

ఇటీవల విజయవాడలో స్పోర్ట్స్ కోటా టీచర్లపై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడటాన్ని సీఎం ఈ సందర్భంగా తీవ్రంగా ఖండించారు. వ్యవస్థలో చట్టబద్ధమైన మార్గాలు ఉండగా దాడులకు పాల్పడటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఫేక్ పార్టీలు ఇతరులను విమర్శించడం మానుకోవాలని మండిపడ్డారు. విధ్వంసకారులను తరిమికొట్టే సత్తా కుప్పం ప్రజలకు ఉందని ఆయన పేర్కొన్నారు. డీఎస్సీ అంటేనే తెలుగుదేశం పార్టీ అని ఉద్ఘాటించిన సీఎం.. విపక్షాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా, వేల సంఖ్యలో పిటిషన్లు వేసినా వాస్తవాలను ధైర్యంగా ఎదుర్కొని మెగా డీఎస్సీ ద్వారా సుమారు 16 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని స్పష్టం చేశారు.

కుప్పంతో నాది కుటుంబ అనుబంధం..
కుప్పం నియోజకవర్గంతో తనది కేవలం రాజకీయ బంధం కాదని, కుటుంబ అనుబంధమని సీఎం చంద్రబాబు భావోద్వేగానికి గురయ్యారు. "నారావారిపల్లె నాకు జన్మనిస్తే, కుప్పం నాకు రాజకీయ జీవితాన్ని ప్రసాదించింది" అని ఉద్ఘాటించారు. కుప్పంలోని ప్రతి గ్రామంలో మౌలిక సదుపాయాలు కల్పించి, ప్రతి కుటుంబానికి సొంతింటి కల నెరవేర్చడమే 'స్వర్ణ కుప్పం' ప్రధాన ధ్యేయమన్నారు. రాయలసీమ ప్రాంతం ఎడారిగా మారకూడదనే ఉద్దేశంతో ఎన్టీఆర్ స్ఫూర్తితో ముందుకెళ్తున్నామని తెలిపారు. అందులో భాగంగానే శ్రీశైలం నుంచి వందల కిలోమీటర్ల మేర నీటిని తరలించి కుప్పం దాహార్తిని తీర్చడం ద్వారా అసాధ్యాన్ని సుసాధ్యం చేశామని చంద్రబాబు గుర్తుచేశారు.

ఇవి కూడా చదవండి