Loading Time...
Search
న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ
Install App

ఇరాన్‌పై అమెరికా దాడులు? 12 మంది మృతి!

Author
Posted By M TODAY NEWS
| 21 Sep 2026, 10:47 PM | INTERNATIONAL
ఇరాన్‌పై అమెరికా దాడులు? 12 మంది మృతి!

ముఖ్యమైన పాయింట్స్:

  • 760 నౌకలు ధ్వంసమయ్యాయన్న ఇరాన్ న్యాయవ్యవస్థ
  • తమ పౌరులకు అమెరికా అత్యవసర హెచ్చరికలు.. తక్షణమే దేశం విడిచి రావాలని ఆదేశం
  • పశ్చిమాసియాలో మరోసారి తారస్థాయికి ఉద్రిక్తతలు

పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మళ్లీ కమ్ముకుంటున్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. అమెరికా జరిపిన క్షిపణి దాడుల్లో 12 మంది ప్రాణాలు కోల్పోగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారని ఇరాన్ సంచలన ఆరోపణలు చేసింది. ఈ దాడుల్లో భారీ సంఖ్యలో నౌకలు ధ్వంసమైనట్లు వెల్లడించింది. ఈ పరిణామాలతో మధ్యప్రాచ్యంలో పరిస్థితులు ఒక్కసారిగా వేడెక్కాయి.

అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన: అలీ కజెమీ
అమెరికా దాడులపై ఇరాన్ న్యాయవ్యవస్థ ప్రతినిధి అలీ కజెమీ అధికారిక ప్రకటన విడుదల చేశారు. దెబ్బతిన్న మొత్తం 760 నౌకల్లో.. 420 చేపల వేట నౌకలు (వీటిలో 70 సంప్రదాయ ధోలు, 350 చిన్న పడవలు), 340 వాణిజ్య నౌకలు ఉన్నట్లు ఆయన స్పష్టం చేశారు. అయితే, ఈ దాడులు కచ్చితంగా ఎప్పుడు జరిగాయి అనే అంశంపై ఆయన స్పష్టతనివ్వలేదు. అంతర్జాతీయ మానవతా చట్టాలను, కనీస ముందుజాగ్రత్త సూత్రాలను దాడికి పాల్పడిన వారు ఉల్లంఘించారని ఆయన మండిపడ్డారు. బాధితుల నుంచి అధికారులు ఫిర్యాదులు స్వీకరిస్తున్నారని, ఇప్పటికే 300 నౌకలకు సంబంధించిన నష్టాల అంచనా పూర్తయిందని తెలిపారు. కాగా, ఈ దాడులపై అమెరికా ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు.

అమెరికా పౌరులకు అలర్ట్
మరోవైపు, ఇరాన్ ఆరోపణల నేపథ్యంలో అమెరికా అప్రమత్తమైంది. తమ పౌరులకు అత్యవసర సూచనలతో కీలక అడ్వైజరీ జారీ చేసింది. "ఎలాంటి కారణం ఉన్నా ఇరాన్‌కు వెళ్లొద్దు. ఇప్పటికే అక్కడ ఉన్న అమెరికన్లు తక్షణమే ఆ దేశాన్ని విడిచిపెట్టి రావాలి" అని స్పష్టం చేసింది. ఇరాన్‌లో భద్రతా పరిస్థితులు అత్యంత సంక్లిష్టంగా మారుతున్నాయని హెచ్చరించింది. నిరసనలకు, భారీ జనసమూహాలకు దూరంగా ఉండాలని, అమెరికాతో సంబంధం ఉన్న ప్రాంతాల్లో అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించింది. వైమానిక దాడులు జరిగే ముప్పు ఉన్నందున కిటికీలు, అద్దాలకు దూరంగా సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని ఆదేశించింది.
అమెరికా జారీ చేసిన ఈ తాజా హెచ్చరికలతో.. ఇరాన్‌పై అగ్రరాజ్యం మరోసారి భారీ దాడులకు సిద్ధమవుతోందా? అన్న ఆందోళనలు అంతర్జాతీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.

ఇవి కూడా చదవండి