Loading Time...
Search
న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ
Install App

డేటా అక్కర్లేదా? అయితే తక్కువ ధరకే ప్లాన్లు!

Author
Posted By M TODAY NEWS
| 24 Sep 2026, 10:15 PM | Technology
డేటా అక్కర్లేదా? అయితే తక్కువ ధరకే ప్లాన్లు!

ముఖ్యమైన పాయింట్స్:

  • కేవలం వాయిస్, ఎస్ఎంఎస్‌లతో ప్రత్యేక ప్యాక్‌లు
  • అన్ని రకాల వ్యాలిడిటీల్లోనూ తీసుకురావాలని ట్రాయ్ ప్రతిపాదన
  • డేటా లేనందుకు ధరలో గణనీయమైన కోత
  • ఫీచర్ ఫోన్ వాడే వృద్ధులు, గ్రామీణ ప్రజలకు ఊరట

స్మార్ట్‌ఫోన్ల యుగంలోనూ ఇంటర్నెట్‌తో పనిలేకుండా కేవలం ఫోన్ కాల్స్, మెసేజ్‌లకే పరిమితమయ్యే కోట్లాది మంది మొబైల్ వినియోగదారులకు టెలికాం నియంత్రణ సంస్థ (ట్రాయ్) శుభవార్త తెలిపింది. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా (వీఐ) వంటి టెలికాం సంస్థలు డేటా లేకుండా కేవలం వాయిస్, ఎస్ఎంఎస్ సేవలు అందించే ప్రత్యేక ప్లాన్లను అన్ని కాలపరిమితుల్లో (వ్యాలిడిటీ) అందుబాటులోకి తీసుకురావాలని తాజాగా ప్రతిపాదించింది.
గత ఏడాది (2024) డిసెంబరులో తీసుకొచ్చిన నిబంధనల ప్రకారం టెలికాం సంస్థలు కనీసం ఒక 'వాయిస్+ఎస్ఎంఎస్' ప్లాన్‌ను అందిస్తున్నాయి. అయితే ఇవి ఎక్కువగా 80, 84, 336, 365 రోజుల దీర్ఘకాలిక వ్యాలిడిటీలతోనే అందుబాటులో ఉన్నాయి. దీంతో తక్కువ కాలానికి రీచార్జ్ చేసుకోవాలనుకునే వారికి సరైన ఆప్షన్లు లేకుండా పోయాయని ట్రాయ్ గుర్తించింది. ఈ సమస్యకు చెక్ పెడుతూ.. ఒక టెలికాం సంస్థ 28 లేదా 30 రోజుల వ్యాలిడిటీతో డేటాతో కూడిన ప్యాక్‌ను అందిస్తే, కచ్చితంగా అదే కాలపరిమితితో కేవలం వాయిస్, ఎస్ఎంఎస్ సేవలతో కూడిన ప్రత్యేక ప్లాన్‌ను కూడా ప్రవేశపెట్టాలని స్పష్టం చేసింది. సంస్థలు అందించే ప్రతి వ్యాలిడిటీ ప్లాన్‌కు ప్రత్యామ్నాయంగా ఈ 'ఓన్లీ కాలింగ్' ఆప్షన్ ఉండాలని సూచించింది.

కొత్త ప్లాన్ల ధరల నిర్ణయంలోనూ ట్రాయ్ కీలక మార్గదర్శకాలను ప్రతిపాదించింది. ప్లాన్ నుంచి డేటాను తొలగించినప్పుడు అందుకు అనుగుణంగా ధరలో గణనీయమైన తగ్గింపు ఉండాలని స్పష్టం చేసింది. అయితే, ఎంత తగ్గించాలనే కచ్చితమైన ధరను ట్రాయ్ నిర్ణయించలేదు. డేటాతో కూడిన ప్లాన్ల ధరల దామాషా ప్రకారం టెలికాం సంస్థలే ఈ వాయిస్ ప్లాన్ల ధరలను ఖరారు చేయాల్సి ఉంటుంది.

మొబైల్ డేటా అవసరం లేని వృద్ధులు, గ్రామీణ ప్రజలు, ఫీచర్ ఫోన్ వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని ట్రాయ్ ఈ మార్పులకు శ్రీకారం చుట్టింది. వాడని డేటాకు సైతం వినియోగదారులు అదనపు భారం మోయాల్సి వస్తోందని భావించి ఈ నిర్ణయం తీసుకుంది. ఇకపై ఈ 'వాయిస్+ఎస్ఎంఎస్' ప్లాన్లను కస్టమర్లు సులభంగా గుర్తించేలా టెలికాం సంస్థల వెబ్‌సైట్లు, మొబైల్ యాప్‌లు, కస్టమర్ కేర్ కేంద్రాలు, రిటైల్ దుకాణాల్లో స్పష్టంగా ప్రదర్శించాలని ట్రాయ్ తన ప్రతిపాదనలో టెలికాం ఆపరేటర్లను ఆదేశించింది.

ఇవి కూడా చదవండి