Loading Time...
Search
న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ
Install App

పెళ్లైన 14 రోజులకే ప్రియుడి కోసం.. అడ్డువస్తే వరకట్నం కేసు పెడతామని భర్తకు వధువు బెదిరింపులు

Author
Posted By M TODAY NEWS
| 24 Sep 2026, 10:48 PM | NATIONAL
పెళ్లైన 14 రోజులకే ప్రియుడి కోసం.. అడ్డువస్తే వరకట్నం కేసు పెడతామని భర్తకు వధువు బెదిరింపులు

ఘజియాబాద్: వివాహేతర సంబంధాల మోజులో పడి దారుణాలకు ఒడిగడుతున్న ఘటనలు సమాజంలో ఆందోళన పెంచుతున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఓ నవ వధువు పెళ్లైన రెండు వారాలకే ప్రియుడి కోసం భర్తను వదిలేసి వెళ్లిపోయింది. తన వ్యవహారానికి అడ్డువస్తే గృహహింస, వరకట్న వేధింపుల కేసులు పెడతామంటూ భర్తను బెదిరించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.

పోలీసుల వివరాల ప్రకారం.. ఘజియాబాద్‌లోని కౌశాంబి ప్రాంతానికి చెందిన అభినవ్‌ ఖండేల్‌వాల్‌కు, రాణి అనే యువతితో జులై 11న వివాహం జరిగింది. పెళ్లైన వారం రోజులకే రాణి తరచూ ఫోన్‌లో వేరే వ్యక్తితో మాట్లాడుతుండటాన్ని అభినవ్‌ గమనించాడు. ఎవరితో మాట్లాడుతున్నావని నిలదీయగా, తన ప్రియుడితోనే అని ఆమె ఏమాత్రం బెరుకు లేకుండా చెప్పేసింది. ఈ విషయాన్ని అభినవ్‌ ఇరు కుటుంబాల పెద్దల దృష్టికి తీసుకెళ్లడంతో వివాదం మొదలైంది.

ఈ క్రమంలో పెళ్లైన 14వ రోజుకే రాణి తన పుట్టింటికి వెళ్లిపోయింది. కొద్దిరోజుల తర్వాత సర్దుకుపోయిన అభినవ్.. తిరిగి కాపురానికి రావాలని భార్యను కోరగా, తాను ప్రియుడిని వదిలి ఉండలేనని ఆమె స్పష్టం చేసింది. అంతేకాకుండా, తన ప్రేమ వ్యవహారంలో జోక్యం చేసుకుంటే గృహహింస కేసు నమోదు చేస్తానని, తప్పుడు వరకట్న వేధింపుల కేసు పెడతామని ఆమె కుటుంబ సభ్యులు బెదిరింపులకు దిగుతున్నారని అభినవ్ ఆరోపించాడు.

ఇవి కూడా చదవండి

రోజురోజుకూ బెదిరింపులు తీవ్రం కావడంతో బాధితుడు అభినవ్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇటీవల కాలంలో ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తలను దారుణంగా హత్య చేస్తున్న ఘటనలు తరచూ వెలుగుచూస్తున్న నేపథ్యంలో.. ఈ వ్యవహారంలో ప్రాణాపాయం తప్పిందని, ఇది బాధితుడికి ఒకరకంగా ఊరట కలిగించే విషయమేనని సోషల్ మీడియాలో నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.