Loading Time...
Search
న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ
Install App

ఫెడరల్ బ్యాంక్‌లో జనా ఎస్ఎఫ్‌బీ విలీనం!

Author
Posted By M TODAY NEWS
| 26 Sep 2026, 09:29 PM | NATIONAL
ఫెడరల్ బ్యాంక్‌లో జనా ఎస్ఎఫ్‌బీ విలీనం!

ముఖ్యమైన పాయింట్స్:

  • షేర్ స్వాప్ పద్ధతిలో లావాదేవీలకు కసరత్తు
  • • ప్రధాన సవాల్‌గా హెచ్‌ఆర్, ఉద్యోగుల సర్దుబాటు
  • • రేసులో ఐడీబీఐ వాటాల విక్రయ ప్రక్రియ

జనా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (ఎస్ఎఫ్‌బీ) త్వరలో ఫెడరల్ బ్యాంక్‌లో విలీనం కానున్నట్లు తెలుస్తోంది. ఈ భారీ లావాదేవీని నగదు రూపంలో కాకుండా 'షేర్ స్వాప్' (వాటాల మార్పిడి) పద్ధతిలో పూర్తిచేసే దిశగా ఇరు సంస్థల మధ్య ముమ్మర చర్చలు సాగుతున్నాయి. జనా ఎస్ఎఫ్‌బీ షేరు విలువను రూ. 620-650 మధ్య, ఫెడరల్ బ్యాంక్ షేరును రూ. 350గా అంచనా వేస్తూ మార్పిడి నిష్పత్తిపై కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఫెడరల్ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ సుమారు రూ. 82,000 కోట్లుగా ఉండగా.. జనా ఎస్ఎఫ్‌బీ మార్కెట్ విలువ దాదాపు రూ. 5,600 కోట్లుగా ఉంది.

ఫెడరల్ బ్యాంక్‌కు వ్యూహాత్మక ప్రయోజనం
ఈ విలీన ఒప్పందం విజయవంతంగా పూర్తయితే, జనా ఎస్ఎఫ్‌బీ తన స్వతంత్ర ఉనికిని కోల్పోయి ఫెడరల్ బ్యాంక్‌లో పూర్తిగా అంతర్భాగమవుతుంది. ఈ డీల్ ద్వారా జనా హోల్డింగ్స్‌లో కీలక పెట్టుబడిదారుగా ఉన్న 'టీపీజీ' సంస్థ తన పెట్టుబడులను ఉపసంహరించుకునే (ఎగ్జిట్) అవకాశం ఉంది. మరోవైపు, ఈ విలీనం ఫెడరల్ బ్యాంక్‌ వ్యాపార విస్తరణకు ఎంతో లాభించనుంది. మైక్రోఫైనాన్స్ పోర్ట్‌ఫోలియో బలోపేతం కావడంతో పాటు, ఉత్తర, మధ్య భారతదేశాల్లో తక్కువ ఆదాయ వర్గాలకు చేరువయ్యేందుకు జనా ఎస్ఎఫ్‌బీ నెట్‌వర్క్ కీలకంగా మారనుంది. తద్వారా ఆర్‌బీఐ నిర్దేశించిన 'ప్రాధాన్య రంగ రుణాల' నిబంధనలను ఫెడరల్ బ్యాంక్ సులభంగా చేరుకునే అవకాశం ఉంది.

సిబ్బంది సర్దుబాటే అతిపెద్ద సవాల్
ఈ డీల్‌లో మానవ వనరుల (హెచ్‌ఆర్) సర్దుబాటు ప్రస్తుతం అతిపెద్ద సవాల్‌గా మారింది. ఫెడరల్ బ్యాంక్‌లో 17,000 మంది ఉద్యోగులు ఉండగా.. జనా ఎస్ఎఫ్‌బీలో అంతకంటే ఎక్కువగా 26,000 మందికి పైగా సిబ్బంది ఉన్నారు. వీరిలో మెజారిటీ సిబ్బంది మైక్రోఫైనాన్స్ ఫీల్డ్ కార్యకలాపాల్లో ఉన్నారు. జనా ఎస్ఎఫ్‌బీ లోన్ పోర్ట్‌ఫోలియో తక్కువగా ఉన్నప్పటికీ, సిబ్బంది సంఖ్య భారీగా ఉండటంతో వీరిని ఎలా సర్దుబాటు చేయాలనే దానిపై ప్రతిష్టంభన నెలకొంది. హెచ్‌ఆర్, కార్యాచరణ అంశాలపై స్పష్టమైన పరిష్కారం లభిస్తేనే ఈ డీల్ ముందుకు సాగుతుంది. ఈ విలీన ప్రక్రియపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

ఐడీబీఐ బ్యాంక్ రేసులో ఫెయిర్‌ఫాక్స్, ఎమిరేట్స్ ఎన్‌బీడీ
మరోవైపు, ఐడీబీఐ బ్యాంక్‌లో కేంద్ర ప్రభుత్వం, ఎల్ఐసీకి సంయుక్తంగా ఉన్న 60.72 శాతం వాటాల విక్రయ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. ఈ వాటాలను దక్కించుకునేందుకు ఫెయిర్‌ఫాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్, దుబాయ్‌కు చెందిన ఎమిరేట్స్ ఎన్‌బీడీ సంస్థలు సవరించిన బిడ్లను దాఖలు చేశాయి. ప్రభుత్వం ప్రస్తుతం ఈ ఫైనాన్షియల్ బిడ్లను నిశితంగా పరిశీలిస్తోంది. దీనిపై కూడా త్వరలోనే తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.