Loading Time...
Search
న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ
Install App

డీఎస్సీపై సీబీఐ విచారణకు మేము సిద్ధం.. అక్రమాస్తుల కేసుల దర్యాప్తును అంగీకరించే దమ్ము జగన్‌కు ఉందా?

Author
Posted By M TODAY NEWS
| 26 Sep 2026, 10:32 PM | Politics
డీఎస్సీపై సీబీఐ విచారణకు మేము సిద్ధం.. అక్రమాస్తుల కేసుల దర్యాప్తును అంగీకరించే దమ్ము జగన్‌కు ఉందా?

అమరావతి: డీఎస్సీ (DSC) ఉపాధ్యాయ పోస్టుల భర్తీపై ప్రతిపక్ష వైసీపీ చేస్తున్న ఆరోపణలను టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. డీఎస్సీ నిర్వహణపై ఎలాంటి సీబీఐ విచారణకైనా తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. అయితే, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముందుగా తనపై ఉన్న అక్రమాస్తుల కేసులు, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ వెల్లడించిన వాస్తవాలను అంగీకరించాలని ఆయన డిమాండ్ చేశారు. సీబీఐ నివేదికలు, దర్యాప్తు అంశాలను జగన్ నిజమేనని ఒప్పుకున్న మరుక్షణమే.. డీఎస్సీ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని తాను ఒప్పిస్తానని సోమిరెడ్డి సవాల్ విసిరారు.
అత్యంత పారదర్శకంగా ఉపాధ్యాయ నియామకాలు
రాష్ట్రంలో 16,372 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి పారదర్శకంగా జరిగిందని సోమిరెడ్డి ఉద్ఘాటించారు. ఈ నియామకాల్లో ఎలాంటి అక్రమాలకు చోటు లేదని, ముఖ్యంగా స్పోర్ట్స్ కోటా భర్తీలో ఎలాంటి అవకతవకలు జరగలేదని స్పష్టం చేశారు. కేవలం అభ్యర్థుల అర్హతల ఆధారంగానే ఎంపిక ప్రక్రియ సాగిందని వెల్లడించారు.
నిరుద్యోగులకు ప్రభుత్వం పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించడాన్ని జీర్ణించుకోలేకనే జగన్ పార్టీ లేనిపోని ఆరోపణలు చేస్తోందని ఆయన మండిపడ్డారు. డీఎస్సీపై వైసీపీ చేస్తున్న విమర్శలన్నీ కేవలం రాజకీయ దురుద్దేశంతో కూడుకున్నవేనని కొట్టిపారేశారు. నియామకాల విషయంలో ప్రభుత్వం అత్యంత చిత్తశుద్ధితో వ్యవహరించిందని, ప్రతిపక్షం చేస్తున్న బురదజల్లే రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని సోమిరెడ్డి హెచ్చరించారు.