Loading Time...
Search
న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ
Install App

బ్యాంకుల సమ్మె వాయిదా.. కస్టమర్లకు భారీ ఊరట!

Author
Posted By M TODAY NEWS
| 28 Sep 2026, 09:22 PM | BUSINESS
బ్యాంకుల సమ్మె వాయిదా.. కస్టమర్లకు భారీ ఊరట!

ముఖ్యమైన పాయింట్స్:

  • ఐబీఏతో సఫలమైన చర్చలు.. అక్టోబర్ 2న మొబైల్ రిటైలర్ల ‘నో యూపీఐ డే’

దేశవ్యాప్తంగా మూడ్రోజుల పాటు జరగాల్సిన బ్యాంకుల సమ్మె చివరి నిమిషంలో వాయిదా పడింది. సమ్మె వార్తలతో తీవ్ర ఆందోళన చెందిన సామాన్య ప్రజలకు, వ్యాపార వర్గాలకు ఇది పెద్ద ఊరటనిచ్చింది. ఈ నెల 28 నుంచి 30 వరకు తలపెట్టిన సమ్మెను తాత్కాలికంగా విరమించుకుంటున్నట్లు బ్యాంకు ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ)తో జరిగిన చర్చలు సఫలం కావడంతో సోమవారం నుంచి అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు యథాతథంగా సేవలు అందిస్తున్నాయి.

ఫలించిన అర్ధరాత్రి భేటీ..

ఆదివారం రాత్రి 9:30 గంటల సమయంలో ఐబీఏ, యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) ప్రతినిధుల మధ్య అత్యవసర భేటీ జరిగింది. ఈ సమావేశంలో ఐబీఏ నుంచి సానుకూల హామీ రావడంతో యూనియన్లు సమ్మెను విరమించాయి. ఉద్యోగుల ప్రధాన డిమాండ్ అయిన ‘వారానికి ఐదు రోజుల పనిదినాల’ అమలుపై ఇరువర్గాల మధ్య ఒక అంగీకారం కుదిరింది. ప్రస్తుతం నెలకు రెండు, నాలుగో శనివారాలు మాత్రమే సెలవులు ఉండగా, అన్ని శనివారాలు సెలవులు ఇవ్వాలన్న డిమాండ్‌ సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నారు. అలాగే స్కేల్-4, ఆ పై అధికారుల పెర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్‌ఐ)లో కీలక మార్పులకు ఐబీఏ పచ్చజెండా ఊపింది. పనిభారం తగ్గింపు, మార్చి 2024 ఒప్పందంలోని పెండింగ్ అంశాలపై ప్రభుత్వం వద్దకు ఉమ్మడి ప్రతిపాదనలు తీసుకెళ్లాలని ఇరు వర్గాలు నిర్ణయించాయి. సమ్మె విరమణతో అర్ధసంవత్సర (హాఫ్ ఇయర్లీ) క్లోజింగ్ సమయంలో బ్యాంకు లావాదేవీలకు ఎలాంటి ఆటంకం లేకుండా పోయింది.

ఇవి కూడా చదవండి

అక్టోబర్ 2న క్యూఆర్ కోడ్‌లకు బ్లాక్ కవర్లు!

ఒకవైపు బ్యాంకుల సమ్మె ముగిసినప్పటికీ.. డిజిటల్ లావాదేవీల విషయంలో మరో కొత్త నిరసన తెరపైకి వచ్చింది. అక్టోబర్ 2న ‘నో యూపీఐ డే’ పాటించాలని ఆల్ ఇండియా మొబైల్ రిటైలర్స్ అసోసియేషన్ (ఏఐఎంఆర్‌ఏ) పిలుపునిచ్చింది. రూ.2,000 దాటిన మర్చంట్ యూపీఐ చెల్లింపులపై 0.4 శాతం ఎండీఆర్ (MDR) ఛార్జీలు వసూలు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ మొబైల్ దుకాణాల్లోని క్యూఆర్ (QR) కోడ్‌లపై నల్లటి వస్త్రం కప్పి నిరసన తెలపనున్నారు. ఈ ఛార్జీల వల్ల చిన్న వ్యాపారులపై నెలకు రూ.2 వేల నుంచి రూ.12 వేల వరకు అదనపు భారం పడుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ ‘నో యూపీఐ’ నిరసనతో తమకు ఎలాంటి సంబంధం లేదని అఖిల భారత వర్తక సమాఖ్య (క్యాట్- CAIT) స్పష్టం చేసింది.