Loading Time...
Search
న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ
Install App

టెలికాం కస్టమర్లకు ట్రాయ్ భారీ ఊరట!

Author
Posted By M TODAY NEWS
| 28 Sep 2026, 09:38 PM | Technology
టెలికాం కస్టమర్లకు ట్రాయ్ భారీ ఊరట!

ముఖ్యమైన పాయింట్స్:

  • ఇకపై ‘వాయిస్, ఎస్ఎంఎస్’ ప్లాన్లు.. 28 రోజుల రీఛార్జ్ సైకిల్‌కు చెక్

టెలికాం రంగంలో వినియోగదారుల ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) సంచలన నిర్ణయం తీసుకుంది. డేటా అవసరం లేకపోయినా బలవంతంగా ఇంటర్నెట్ ప్యాక్‌లను అంటగడుతున్న టెలికాం కంపెనీల వ్యాపార ధోరణికి చెక్ పెడుతూ, కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా కొత్త ఫ్రేమ్‌వర్క్‌ను తీసుకొచ్చింది.

డేటా వద్దు.. కాలింగ్, ఎస్ఎంఎస్ ప్లాన్లు ముద్దు..

ప్రస్తుతం జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా (వీఐ) వంటి సంస్థలు అందిస్తున్న దాదాపు అన్ని ప్లాన్లలో ఇంటర్నెట్ డేటా తప్పనిసరిగా ఉంటోంది. కేవలం మాట్లాడుకోవడానికి లేదా సెకండరీ సిమ్‌ను యాక్టివ్‌గా ఉంచుకోవడానికి మాత్రమే ఫోన్ వాడే కోట్లాది మందిపై ఇది తీవ్ర ఆర్థిక భారం మోపుతోంది. దీనికి ముగింపు పలుకుతూ, ప్రత్యేకంగా 'వాయిస్, ఎస్ఎంఎస్ ఓన్లీ' ప్లాన్లను కచ్చితంగా తీసుకురావాలని టెలికాం సంస్థలను ట్రాయ్ ఆదేశించింది. స్మార్ట్‌ఫోన్ వాడని సీనియర్ సిటిజన్లు, గ్రామీణ ప్రజలు, ఫీచర్ ఫోన్ యూజర్లకు ఈ నిర్ణయంతో భారీ ఊరట కలగనుంది. అదనంగా 30 రోజులు లేదా అంతకంటే తక్కువ వ్యవధితో అందుబాటులో ఉండే చౌకైన వోచర్లను రూపొందించాలని స్పష్టం చేసింది.

28 రోజుల వ్యాలిడిటీకి బ్రేక్..

ఇవి కూడా చదవండి

ఇప్పటివరకు టెలికాం కంపెనీలు అమలు చేస్తున్న 28 రోజుల రీఛార్జ్ వ్యాలిడిటీ కారణంగా కస్టమర్లు ఏడాదిలో 12 నెలలకు బదులు 13 సార్లు రీఛార్జ్ చేసుకోవాల్సి వస్తోంది. ఈ ‘కంబైన్డ్ వ్యాలిడిటీ’ ట్రిక్‌కు ట్రాయ్ బ్రేక్ వేసింది. ఇకపై 'క్యాలెండర్ నెల' ఆధారిత వ్యాలిడిటీని అమలు చేయాలని ఆదేశించింది. అంటే, మీరు ఒక నెలలో 10వ తేదీన రీఛార్జ్ చేసుకుంటే మళ్లీ వచ్చే నెల 10వ తేదీనే ఆ ప్లాన్ ముగుస్తుంది. ఒకవేళ ఫిబ్రవరి వంటి తక్కువ రోజులున్న నెలల్లో ఆ నిర్దిష్ట తేదీ లేకపోతే, ఆ నెల చివరి రోజు వరకు వ్యాలిడిటీ సజావుగా కొనసాగుతుంది.
ట్రాయ్ తాజా నిబంధనలతో టెలికాం ఆపరేటర్లు ప్రత్యేక ప్లాన్లపై ధరలను తగ్గించక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఈ మేరకు కొత్త టారిఫ్ ప్లాన్ల రూపకల్పనను కంపెనీలు ఇప్పటికే వేగవంతం చేశాయి. దీనివల్ల టెలికాం సంస్థల సగటు ఆదాయంపై స్వల్ప ప్రభావం పడినా, కస్టమర్లకు మాత్రం జేబు భారం భారీగా తగ్గనుంది. రాబోయే రోజుల్లో టెలికాం కంపెనీలు కొత్త టారిఫ్ ప్లాన్లను అధికారికంగా ప్రకటించగానే సామాన్యుడికి ఎంత మేర లబ్ధి చేకూరుతుందనేది స్పష్టమవుతుంది.