Loading Time...
Search
న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ
Install App

పెండింగ్ చలాన్లకు కరెంట్ బిల్లుల లింక్!

Author
Posted By M TODAY NEWS
| 28 Sep 2026, 09:43 PM | Politics
పెండింగ్ చలాన్లకు కరెంట్ బిల్లుల లింక్!

ముఖ్యమైన పాయింట్స్:

  • జరిమానాలు కట్టకపోతే లైసెన్స్, ఆర్‌సీ రెన్యువల్ బ్రేక్.. చలాన్ల వసూళ్లపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి, జరిమానాలు చెల్లించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వాహనదారులకు సుప్రీంకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. కేవలం ఈ-చలాన్లు జారీ చేస్తే సరిపోదని, పెండింగ్ జరిమానాలను వసూలు చేసేందుకు క్షేత్రస్థాయిలో కఠిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించింది. ప్రజలు ట్రాఫిక్ చలాన్లు చెల్లించకపోతే, ఆ బకాయిలను కరెంటు బిల్లులతో పాటు ఇతర ప్రభుత్వ బిల్లులకు లింక్ చేసి వసూలు చేసే మార్గాలను అన్వేషించాలని జస్టిస్ జె.బి.పార్దీవాలా సంచలన సూచన చేశారు.

దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో దాదాపు రూ.45,000 కోట్ల మేర ఈ-చలాన్ల బకాయిలు పెండింగ్‌లో ఉండగా, ఇప్పటివరకు కేవలం రూ.25,000 కోట్లు మాత్రమే వసూలయ్యాయని అధికారులు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం.. లక్షల సంఖ్యలో చలాన్లు జారీ చేయడం కాదు, ఆ జరిమానాలను వసూలు చేయడమే అసలైన సవాలని జస్టిస్ పార్దీవాలా వ్యాఖ్యానించారు.

పెండింగ్ చలాన్ల వసూలు కోసం కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశాన్ని సుప్రీంకోర్టు అధికారులకు కల్పించింది. జరిమానాలు పూర్తిగా క్లియర్ అయ్యే వరకు చలాన్లు పెండింగ్‌లో ఉన్న వాహనాల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ల (ఆర్‌సీ) పునరుద్ధరణను నిలిపివేయాలని, నకిలీ ఆర్‌సీల జారీతో పాటు యాజమాన్య బదిలీకి బ్రేక్ వేయాలని కోర్టు స్పష్టం చేసింది. అలాగే ఆయా వాహనాలకు ఫిట్‌నెస్, కాలుష్య నియంత్రణ (పీయూసీ) సర్టిఫికెట్లను జారీ చేయకూడదని ఆదేశించింది. పెండింగ్ చలాన్లు ఉన్న వాహనాలను 'పరివాహన్' పోర్టల్‌లో బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలని, సదరు వ్యక్తుల డ్రైవింగ్ లైసెన్సులను సస్పెండ్ చేయడంతో పాటు రెన్యువల్ ప్రక్రియను నిలిపివేయాలని సూచించింది. ఇక రహదారులపై పోలీసులు తనిఖీలు చేస్తున్నప్పుడు, ఈ-చలాన్లు పెండింగ్‌లో ఉన్నట్లు తేలితే.. వెంటనే ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకునే (సీజ్ చేసే) అవకాశాన్ని కూడా పరిశీలించాలని ధర్మాసనం పేర్కొంది. సుప్రీంకోర్టు తాజా మార్గదర్శకాలతో ట్రాఫిక్ పోలీసులు ఇకపై జరిమానాల వసూళ్లలో మరింత దూకుడు పెంచే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి