Loading Time...
Search
న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ
Install App

ఉదయం 6.30 గంటల నుంచే పింఛన్ల పంపిణీ!

Author
Posted By M TODAY NEWS
| 28 Sep 2026, 09:54 PM | ANDHRA PRADESH
ఉదయం 6.30 గంటల నుంచే పింఛన్ల పంపిణీ!

ముఖ్యమైన పాయింట్స్:

  • ముందస్తు ప్రణాళికతో లబ్ధిదారుల ఇళ్ల వద్దకే నగదు.. ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడి

రాష్ట్రవ్యాప్తంగా అక్టోబర్‌ 1వ తేదీ ఉదయం 6.30 గంటల నుంచే పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, సెర్ప్ (గ్రామీణ పేదరిక నిర్మూలన), ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ వెల్లడించారు. పింఛన్ల పంపిణీ సమయాల్లో మార్పులు జరిగినట్లు వచ్చిన వదంతులను ఆయన కొట్టిపారేశారు. ఎప్పటిలాగే తెల్లవారుజాము నుంచే సిబ్బంది లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి నేరుగా నగదు అందజేస్తారని స్పష్టం చేశారు. బ్యాంకు ఉద్యోగుల సమ్మె విరమణతో రాష్ట్రంలో బ్యాంకింగ్‌ లావాదేవీలకు ఎలాంటి ఆటంకం లేదని, దీంతో ముందస్తు ప్రణాళిక ప్రకారమే పంపిణీకి సర్వం సిద్ధం చేశామని మంత్రి వివరించారు. సెప్టెంబర్‌ 30వ తేదీనే స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు సిబ్బంది తమ పరిధిలోని బ్యాంకుల నుంచి పింఛన్లకు అవసరమైన వంద శాతం నగదును డ్రా చేసుకుంటారని, ఒకటో తేదీ ఉదయం నుంచే పంపిణీ ప్రారంభిస్తారని తెలిపారు.

అక్టోబర్‌ నెలకు సంబంధించి రాష్ట్రంలోని 61.80 లక్షల మంది పింఛనుదారుల కోసం ప్రభుత్వం ఇప్పటికే రూ.2,692.34 కోట్లను విడుదల చేసిందని మంత్రి తెలిపారు. ఇందులో రూ.2,692.28 కోట్లను పంచాయతీలు, వార్డుల ఖాతాలకు జమ చేయగా, గజపతినగరం మండలంలోని నేషనల్‌ సోషల్‌ అసిస్టెన్స్‌ ప్రోగ్రామ్‌ (ఎన్ఎస్ఏపీ) పింఛనుదారులకు సంబంధించిన రూ.6 లక్షలను డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌ (డీబీటీ) విధానంలో నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేయనున్నట్లు వెల్లడించారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి నెలా ఒకటో తేదీన సకాలంలో ఇంటి వద్దే పింఛను అందించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుందని ఆయన పునరుద్ఘాటించారు.

పింఛన్ల పంపిణీలో ఎలాంటి జాప్యం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. సెప్టెంబర్‌ 30వ తేదీ నాటికి అవసరమైన నగదు పూర్తిగా అందుబాటులో ఉండేలా జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్లు (పీడీలు), ఎంపీడీవోలు, మున్సిపల్‌ కమిషనర్లు, రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ)తో పాటు సంబంధిత బ్యాంకర్లతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. బ్యాంకుల నుంచి నగదు ఉపసంహరణ మొదలుకొని లబ్ధిదారుల చేతికి నగదు అందే వరకు ప్రతి దశలోనూ అధికారులు, సిబ్బంది జాగ్రత్తలు వహించాలని, అక్టోబర్ 1 ఉదయం నుంచే పంపిణీ విజయవంతంగా సాగేలా చూడాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ దిశానిర్దేశం చేశారు.

ఇవి కూడా చదవండి