Loading Time...
Search
న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ
Install App

ఓటరు జాబితా సవరణ: తెలంగాణలో 92 లక్షల మందికి నోటీసులు

Author
Posted By M TODAY NEWS
| 29 Sep 2026, 08:14 AM | TELANGANA
ఓటరు జాబితా సవరణ: తెలంగాణలో 92 లక్షల మందికి నోటీసులు

ముఖ్యమైన పాయింట్స్:

  • 45 లక్షల మందికి పైగా ఓటర్లకు అర్హత నిర్ధారణ.. వివరాలు వెల్లడించిన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌ రెడ్డి

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SSR) ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. పారదర్శకమైన ఓటరు జాబితా రూపకల్పనలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 92 లక్షల మందికి పైగా ఓటర్లకు విచారణ నోటీసులు జారీ చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) సుదర్శన్‌ రెడ్డి వెల్లడించారు.

ఓటరు జాబితా సవరణకు సంబంధించిన తాజా వివరాలను ఆయన మీడియాకు విడుదల చేశారు. అధికారిక గణాంకాల ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 92,88,180 నోటీసులను జనరేట్ చేయగా, వాటిలో 87,85,739 మందికి అధికారులు నోటీసులను జారీ చేశారు.

క్షేత్రస్థాయిలో ఈ ప్రక్రియను వేగవంతం చేసిన అధికారులు.. ఇప్పటివరకు 58,97,432 మంది ఓటర్ల విచారణ (హియరింగ్) ప్రక్రియను పూర్తి చేశారు. ఇలా విచారణ పూర్తయిన వారిలో 45,54,236 మంది ఓటర్లను తుది ఓటరు జాబితాకు అర్హులుగా నిర్ధారించినట్లు సీఈవో సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా, బోగస్ ఓట్లను ఏరివేసేలా ఎన్నికల సంఘం ఈ ప్రక్రియను పకడ్బందీగా చేపడుతోంది.

ఇవి కూడా చదవండి