Loading Time...
Search
న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ
Install App

పట్టాలపై నెత్తురోడిన మూగజీవాలు

Author
Posted By M TODAY NEWS
| 29 Sep 2026, 11:35 AM | Crime
పట్టాలపై నెత్తురోడిన మూగజీవాలు

ముఖ్యమైన పాయింట్స్:

  • రైలు ఢీకొని 100కు పైగా గొర్రెల మృతి
  • - ఘట్‌కేసర్‌ సమీపంలో తెల్లవారుజామున ఘటన
  • - కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న కాపరులు

ఘట్‌కేసర్‌: మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్‌ రైల్వే స్టేషన్‌ పరిధిలో మంగళవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా దూసుకొచ్చిన రైలు ఢీకొనడంతో 100కు పైగా గొర్రెలు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాయి. ఈ హృదయ విదారక ఘటన ఔషాపూర్‌ సమీపంలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. యాదాద్రి-భువనగిరి జిల్లా జూలూరు అలీనగర్‌కు చెందిన కాపరులు తమ గొర్రెల మందతో కేపాల్‌ వద్ద రైల్వే పట్టాల సమీపంలో బస చేశారు. కాపరులు గాఢ నిద్రలో ఉన్న సమయంలో, అటుగా వస్తున్న రైలు భారీ శబ్దానికి గొర్రెలు తీవ్ర భయాందోళనకు గురయ్యాయి. ప్రాణభయంతో ఒక్కసారిగా చెల్లాచెదురై రైల్వే పట్టాలపైకి పరుగులు తీశాయి. అదే సమయంలో కాజీపేట నుంచి హైదరాబాద్‌ (నాంపల్లి) వైపు వెళ్తున్న దక్షిణ్‌ ఎక్స్‌ప్రెస్‌ వేగంగా దూసుకురావడంతో పట్టాలపై ఉన్న గొర్రెలను ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో సుమారు 100కు పైగా గొర్రెలు శరీర భాగాలు ఛిద్రమై అక్కడికక్కడే మృత్యువాత పడ్డాయి. పట్టాల పొడవునా వందలాది మీటర్ల మేర మూగజీవాల కళేబరాలు చెల్లాచెదురుగా పడి ఉండటం స్థానికులను కలిచివేసింది. ఉదయం నిద్రలేచి చూసిన కాపరులు రక్తపు మడుగులో పడి ఉన్న తమ జీవాలను చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. లక్షల్లో ఆస్తి నష్టం వాటిల్లడంతో బాధితులు బోరున విలపిస్తున్నారు.

సమాచారం అందుకున్న వెంటనే రైల్వే అధికారులు, స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. పట్టాలపై ఉన్న కళేబరాలను తొలగించి రైళ్ల రాకపోకలకు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి