Loading Time...
Search
న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ
Install App

సీలింగ్ భూములపై సర్కార్ ఫోకస్.. త్వరలో భారీగా మిగులు భూముల గుర్తింపు!

Author
Posted By M TODAY NEWS
| 03 Oct 2026, 12:51 AM | TELANGANA
సీలింగ్ భూములపై సర్కార్ ఫోకస్.. త్వరలో భారీగా మిగులు భూముల గుర్తింపు!

ముఖ్యమైన పాయింట్స్:

  • అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ స్పష్టత.. పాత రికార్డుల స్క్రూటినీతో భూయజమానులు, రియల్టర్లలో కలకలం

హైదరాబాద్ : రాష్ట్రంలో పాత భూ రికార్డులను, ప్రస్తుత డిజిటల్ వివరాలతో సరిపోల్చే దిశగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఈ ప్రక్రియ పూర్తయితే భారీ ఎత్తున మిగులు భూములు బయటపడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. తెలంగాణలో Land Ceiling Act రద్దయిందంటూ జరుగుతున్న ప్రచారానికి చెక్ పెడుతూ, చట్టం ఇప్పటికీ పకడ్బందీగా అమల్లోనే ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా స్పష్టం చేశారు. పరిమితికి మించి భూములు ఉన్నట్లు తేలితే ప్రభుత్వం వాటిని తక్షణమే స్వాధీనం చేసుకుంటుందని హెచ్చరించారు.

అందుబాటులో ఉన్న ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 2,09,833 మంది సీలింగ్ చట్టం కింద తమ భూములను డిక్లేర్ చేశారు. దీనిద్వారా దాదాపు 4,42,624 ఎకరాల భూమి ప్రభుత్వానికి సమకూరింది. అయితే ఈ భూమిలో ఎంత భాగం పేదలకు పంపిణీ చేశారు, ఎంత విస్తీర్ణాన్ని నివాస స్థలాల కోసం రెగ్యులరైజ్ చేశారనే దానిపై పూర్తిస్థాయి నివేదిక సిద్ధమవుతోంది. ప్రస్తుతం అధికారులు రంగంలోకి దిగి సీలింగ్, ప్రభుత్వ, అసైన్డ్, దేవాదాయ, వక్ఫ్, ఇనాం, భూదాన్ భూములపై Surplus Land Verification చేపట్టారు. ప్రధానంగా కార్పొరేట్ సంస్థలు, కంపెనీల పేర్లతో భారీగా కొనుగోలు చేసిన భూములపై ప్రత్యేక నిఘా పెట్టారు.

54 ఎకరాలు దాటితే కఠిన నిబంధనలు

ఇవి కూడా చదవండి

పరిమితికి మించి భూమి కలిగి ఉన్న సంస్థలపై చట్టపరమైన నిబంధనలను కఠినతరం చేస్తున్నారు. 54 ఎకరాలకు మించి భూమి కొనుగోలు చేసే సంస్థలు తప్పనిసరిగా ప్రభుత్వ అనుమతులు పొంది, నాన్-అగ్రికల్చరల్ వినియోగానికి మార్పిడి చేసుకోవాల్సి ఉంటుంది. పరిమితికి మించిన మిగులు భూమిని ప్రభుత్వానికి అప్పగించాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. ఇలా స్వాధీనం చేసుకున్న భూములను భూమిలేని పేదలు, దళిత, గిరిజన వర్గాలకు వ్యవసాయం మరియు నివాస అవసరాల కోసం కేటాయించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

విక్రయిస్తే రెండేళ్ల జైలు శిక్ష!

సీలింగ్ పరిమితి దాటిన భూములను విక్రయించడం, బహుమతిగా ఇవ్వడం (గిఫ్ట్) లేదా మార్పిడి చేయడం చట్టరిత్యా నేరం. ఇటువంటి అక్రమ లావాదేవీల నిరోధానికి చట్టంలోని Section 17 and 23 ప్రకారం కఠిన నిబంధనలు వర్తిస్తాయి. మిగులు భూముల వివరాలను దాచిపెట్టినా లేదా ప్రభుత్వానికి అప్పగించకపోయినా ఆస్తి స్వాధీనంతో పాటు బాధ్యులకు రెండేళ్ల వరకు జైలు శిక్ష లేదా భారీ జరిమానా విధించే అవకాశం ఉంది. పాత, కొత్త రికార్డుల అనుసంధాన ప్రక్రియ వేగవంతం కావడంతో భూయజమానులు, రియల్ ఎస్టేట్ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.