Loading Time...
Search
న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ
Install App

ఒకే పాస్‌‌తో బస్సు, మెట్రో ప్రయాణం: నగరవాసులకు శుభవార్త!

Author
Posted By M TODAY NEWS
| 03 Oct 2026, 12:55 AM | TELANGANA
ఒకే పాస్‌‌తో బస్సు, మెట్రో ప్రయాణం: నగరవాసులకు శుభవార్త!

ముఖ్యమైన పాయింట్స్:

  • ప్రజాభవన్‌లో ఆర్టీసీ - మెట్రో కామన్‌ పాస్‌ సర్వీస్ ప్రారంభించిన డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొన్నం.. త్వరలో ఆటోలకూ విస్తరణ: సీఎస్‌ సంజయ్‌ జాజు

హైదరాబాద్ : రాజధాని హైదరాబాద్‌లో ప్రజా రవాణా వ్యవస్థను విస్తరించి, ట్రాఫిక్ చిక్కులకు స్వస్తి పలికే దిశగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. నగర ప్రయాణికుల ఇబ్బందులు, రవాణా వ్యయాన్ని తగ్గించేందుకు ఆర్టీసీ బస్సులు మరియు మెట్రో రైళ్లకు వర్తించే Hyderabad Metro and TGSRTC Common Pass విధానాన్ని శుక్రవారం అధికారికంగా ప్రారంభించారు. ప్రజాభవన్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు, రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌లతో కలిసి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సంజయ్‌ జాజు పాల్గొని వివరాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా సీఎస్ సంజయ్ జాజు మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో ప్రతిరోజూ దాదాపు 30 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో, మరో 5 లక్షల మంది మెట్రో రైళ్లలో ప్రయాణిస్తున్నారని తెలిపారు. ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరుకోవడానికి మల్టీ-మోడల్ రవాణాపై ఆధారపడుతూ సమయం, డబ్బు అదనంగా వెచ్చిస్తున్నారని, ఈ ఇబ్బందులను అధిగమించేందుకు First-and-Last Mile Connectivity సులభతరం చేసేలా సాంకేతికతను జోడించి ఈ కామన్ పాస్ తీసుకొచ్చామన్నారు. వ్యక్తిగత వాహనాల వాడకం తగ్గడం ద్వారా నగరంలో ట్రాఫిక్ రద్దీతో పాటు వాయు కాలుష్యం గణనీయంగా తగ్గుతుందని పేర్కొన్నారు.
ఆటో సేవలు అనుసంధానం.. మీ-సేవ ద్వారా పాస్‌ల జారీ
భవిష్యత్తులో ఆటో రిక్షా సేవలను కూడా ఈ కామన్ పాస్ పరిధిలోకి తీసుకురావడానికి చర్యలు చేపడుతున్నట్లు సీఎస్ స్పష్టం చేశారు. 2011 నుంచి పౌరులకు దాదాపు 400 రకాల ప్రభుత్వ సేవలు అందిస్తున్న MeeSeva Services కేంద్రాల ద్వారా త్వరలోనే ఈ మెట్రో-ఆర్టీసీ కామన్ పాస్‌లను పంపిణీ చేసే సదుపాయం కల్పిస్తామన్నారు. నగర ప్రజలకు ప్రయాణాన్ని మరింత సులభతరం, అందుబాటు ధరల్లోకి తెచ్చేందుకు ఆర్టీసీ, మెట్రో రైల్‌ సంస్థలు పూర్తయిన సమన్వయంతో ముందుకు సాగుతాయని వివరించారు.