Loading Time...
Search
న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ
Install App

మద్యం వినియోగంలో తెలంగాణే 'టాప్'..

Author
Posted By M TODAY NEWS
| 03 Oct 2026, 09:52 PM | BUSINESS
మద్యం వినియోగంలో తెలంగాణే 'టాప్'..

ముఖ్యమైన పాయింట్స్:

  • బెల్ట్ షాపులు ఎత్తేయండి: సీఎం రేవంత్‌కు ఎఫ్‌జీజీ విజ్ఞప్తి

హైదరాబాద్: దేశంలోనే అత్యధిక మద్యం వినియోగం నమోదవుతున్న రాష్ట్రంగా తెలంగాణ నిలవడంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మద్యం విచ్చలవిడిగా లభ్యమవుతుండటంతో కుటుంబ వ్యవస్థలు, ప్రజారోగ్యం దెబ్బతింటున్నాయని 'ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్' (FGG) పేర్కొంది. గ్రామాల్లో అక్రమంగా కొనసాగుతున్న బెల్ట్ షాపులను తక్షణమే మూసివేయాలని కోరుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎఫ్‌జీజీ ప్రతినిధులు ఒక వినతిపత్రం సమర్పించారు.


జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NFHS) గణాంకాలను ఉటంకిస్తూ తెలంగాణలో మద్యం వాడకం ప్రమాదకర స్థాయికి చేరిందని ఎఫ్‌జీజీ స్పష్టం చేసింది (Telangana Alcohol Consumption). రాష్ట్ర గ్రామీణ ప్రాంతాల్లోని పురుషుల్లో ఏకంగా 46.6 శాతం మంది, పట్టణ ప్రాంతాల్లో 36.3 శాతం మంది మద్యం సేవిస్తున్నారని తెలిపింది. పట్టణాలతో పోలిస్తే పల్లెల్లోనే ఈ అలవాటు తీవ్రంగా ఉందన్న గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయని, ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలపై తక్షణమే దృష్టి సారించాల్సిన అవసరం ఉందని వివరించింది.

సంక్షేమ ఫలాలు మద్యం పాలు!
రెండు దశాబ్దాల క్రితం మద్యం కేవలం మండల కేంద్రాలకే పరిమితమై ఉండేదని, ఆర్థికంగా మెరుగైన స్థితిలో ఉన్న కొద్దిమంది మాత్రమే సేవించేవారని ఫోరం గుర్తుచేసింది. కానీ, ఇటీవల కాలంలో పల్లెపల్లెనా 'బెల్ట్ షాపులు' పుట్టగొడుగుల్లా వెలియడంతో మద్యం అందరికీ సులభంగా అందుబాటులోకి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రభుత్వం పేదల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా ఇస్తున్న డబ్బులో ఎక్కువ భాగం మద్యం కొనుగోళ్ల రూపంలో తిరిగి ప్రభుత్వ ఖజానాకే చేరుతోందని స్పష్టం చేసింది.

ఇవి కూడా చదవండి

అపరిమిత మద్యం వినియోగం వల్ల ప్రజల ఆరోగ్యం క్షీణించడమే కాకుండా, కుటుంబాల ఆర్థిక పరిస్థితి కుదేలవుతోందని ఫోరం ఆందోళన చెందింది. మహిళలపై పెరుగుతున్న నేరాలు, అనేక సామాజిక రుగ్మతలకు మద్యం అలవాటే ప్రధాన కారణమని పేర్కొంది. కాబట్టి, పల్లెల్లో ప్రజారోగ్యాన్ని పరిరక్షించడానికి, కుటుంబాల శ్రేయస్సును కాపాడటానికి గ్రామాల్లోని బెల్ట్ షాపులన్నింటినీ వెంటనే ఎత్తివేయాలని (Belt Shops Closure) సీఎం రేవంత్ రెడ్డికి 'ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్' (Forum for Good Governance) విజ్ఞప్తి చేసింది.