Loading Time...
Search
న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ
Install App

మైదానంలో తప్పిన ప్రమాదం: తీవ్రంగా ఢీకొన్నా అద్భుత క్యాచ్‌తో మెరిసిన ప్రభ్‌సిమ్రాన్!

Author
Posted By M TODAY NEWS
| 06 Oct 2026, 09:47 PM | స్పోర్ట్స్ న్యూస్
మైదానంలో తప్పిన ప్రమాదం: తీవ్రంగా ఢీకొన్నా అద్భుత క్యాచ్‌తో మెరిసిన ప్రభ్‌సిమ్రాన్!

ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో నాటకీయ పరిణామం చోటుచేసుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియాకు ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లోనే ఊహించని షాక్ తగిలింది. భారత యువ పేసర్ Yash Thakur వేసిన షార్ట్ పిచ్ బంతిని ఆసీస్ ఓపెనర్ మిచెల్ ఓవెన్ పుల్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే టైమింగ్ కుదరకపోవడంతో బంతి గాల్లోకి లేచి కవర్-పాయింట్ దిశగా వెళ్లింది.

ఆ బంతిని అందుకునేందుకు వికెట్ కీపర్ Prabhsimran Singh వేగంగా పరుగెత్తుకొస్తూ కాల్ ఇచ్చాడు. అదే సమయంలో కవర్-పాయింట్ ఫీల్డర్ నిషాంత్ సింధు కూడా క్యాచ్ కోసం అంతే వేగంగా ముందుకు వచ్చాడు. ఒకరినొకరు గమనించకపోవడంతో ఇద్దరూ మైదానంలో అత్యంత బలంగా ఢీకొని కిందపడిపోయారు. అయితే, ఆ ప్రమాదకర పరిస్థితుల్లోనూ ప్రభ్‌సిమ్రాన్ అద్భుతమైన ఏకాగ్రతను ప్రదర్శించి బంతిని చేజారనివ్వకుండా పట్టుకున్నాడు. దీంతో ఓవెన్ (10) నిరాశగా పెవిలియన్ బాటపట్టాడు.
ఆటగాళ్లు ఢీకొన్న తీవ్రత చూసి సహచర ఆటగాళ్లు, మైదానంలోని ప్రేక్షకులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. అయితే అదృష్టవశాత్తూ ఇద్దరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన Viral Video సోషల్ మీడియాలో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది.