Loading Time...
Search
న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ
Install App

తిరుచానూరులో కలకలం: పద్మావతి అమ్మవారి ఏనుగు 'శ్రీనిధి' దాడి.. తీవ్రగాయాలతో మావటికి ఐసియులో చికిత్స!

Author
Posted By M TODAY NEWS
| 06 Oct 2026, 09:57 PM | ANDHRA PRADESH
తిరుచానూరులో కలకలం: పద్మావతి అమ్మవారి ఏనుగు 'శ్రీనిధి' దాడి.. తీవ్రగాయాలతో మావటికి ఐసియులో చికిత్స!

తిరుపతి: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. గత 18 ఏళ్లుగా అమ్మవారి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్న 'శ్రీనిధి' అనే ఆడ ఏనుగు తన మావటిపైనే దారుణంగా దాడికి తెగబడింది. ఆదివారం (అక్టోబర్ 4) రాత్రి ఊంజల్ సేవ ముగిసిన అనంతరం గోశాలకు తరలిస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. తీవ్రంగా గాయపడిన మావటి చంద్రశేఖర్‌‌ను చికిత్స నిమిత్తం Tirupati SVIMS Hospital కు తరలించగా, ఆయన పరిస్థితి ప్రస్తుతం ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

సేవ ముగించుకుని తిరిగి వెళ్తున్న సమయంలో శ్రీనిధి హఠాత్తుగా అదుపుతప్పి పక్కనే ఉన్న ఒకరిపై తొండంతో దాడి చేసేందుకు ప్రయత్నించింది. గమనించిన మావటి చంద్రశేఖర్ వెంటనే అప్రమత్తమై ఏనుగును కంట్రోల్ చేసేందుకు అంకుశం ఉపయోగించారు. దీంతో కోపోద్రిక్తమైన శ్రీనిధి ఒక్కసారిగా ఆయనపై విరుచుకుపడి, తొండంతో కిందపడేసి తొక్కింది. భక్తులు భయంతో పరుగులు తీయగా, అక్కడే ఉన్న ఇతర మావటిలు సమయస్ఫూర్తితో వ్యవహరించి ఏనుగును గొలుసులతో బంధించి సురక్షితంగా TTD Goshala కు తరలించారు.

ఘటన అనంతరం SV Zoo Park పశువైద్యుల బృందం, గోశాల అధికారులు శ్రీనిధికి ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం వయసురీత్యా ఏనుగు ఎదకొచ్చే దశలో ఉందని, హార్మోన్ల మార్పుల వల్ల కలిగిన ఆగ్రహమే ఈ దాడికి కారణమని వైద్యులు విశ్లేషించారు. ఏళ్ల తరబడి ఒంటరిగా ఉండటం, తోడు లేకపోవడం కూడా ఈ ప్రవర్తనా వైపరీత్యానికి దారితీసిందన్నారు. ప్రస్తుతం ఏనుగుకు ఎలాంటి ఇతర ఆరోగ్య సమస్యలు లేవని, ముందుజాగ్రత్త చర్యగా వారం రోజుల పాటు మనుషులకు దూరంగా ఉంచాలని సూచించారు. శరీర చల్లదనం కోసం క్రమం తప్పకుండా స్నానం చేయించడంతో పాటు అరటి ఆకులను ఆహారంగా అందించాలని ఆదేశించారు.

ఇవి కూడా చదవండి

బాధిత మావటి చంద్రశేఖర్‌ను టీటీడీ ఈవో రవిచంద్ర, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి ఆస్పత్రిలో పరామర్శించి, మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.