Loading Time...
Search
న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ
Install App

తెలంగాణ విద్యుత్ వినియోగదారులకు భారీ షాక్: ప్రారంభంకానున్న ట్రూ-అప్ ఛార్జీల బాదుడు!

Author
Posted By M TODAY NEWS
| 06 Oct 2026, 10:07 PM | TELANGANA
తెలంగాణ విద్యుత్ వినియోగదారులకు భారీ షాక్: ప్రారంభంకానున్న ట్రూ-అప్ ఛార్జీల బాదుడు!

హైదరాబాద్: తెలంగాణలోని విద్యుత్ వినియోగదారులపై మరోసారి అదనపు భారం పడనుంది. పవర్ పర్చేజ్, ఇంధన ధరలు మరియు నిర్వహణ వ్యయాలు పెరిగిన నేపథ్యంలో డిస్కంలు ప్రతిపాదించిన ట్రూ-అప్ ఛార్జీలకు తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (TGERC) ఆమోదం తెలిపింది. అయితే, ఉచిత విద్యుత్ పొందుతున్న వ్యవసాయ పంపుసెట్ల వినియోగదారులకు ఈ భారం నుంచి ఊరట లభించింది. మిగిలిన గృహ, వాణిజ్య, పారిశ్రామిక, లిఫ్ట్ ఇరిగేషన్ వినియోగదారులపై త్వరలోనే ఈ అదనపు వసూళ్లు ప్రారంభం కానున్నాయి.


నవంబర్ 2026 నుంచి యూనిట్‌కు 30 పైసలు, డిసెంబర్ 2026 నుంచి యూనిట్‌కు 50 పైసల చొప్పున అదనంగా వసూలు చేయనున్నారు. ఈ నిర్ణయంతో సాధారణ గృహ వినియోగదారుల నెలవారీ కరెంట్ బిల్లులు గణనీయంగా పెరగనున్నాయి. ఉదాహరణకు 200 యూనిట్లు వినియోగించే గృహానికి నవంబర్ నెల బిల్లులో సుమారు ₹60, డిసెంబర్ నుంచి ప్రతి నెలా సుమారు ₹100 అదనపు భారం పడనుంది. ఈ అదనపు ఛార్జీలు TGSPDCL పరిధిలోని వినియోగదారుల నుంచి 29 నెలల పాటు (మార్చి 2029 వరకు), TGNPDCL పరిధిలోని వినియోగదారుల నుంచి 26 నెలల పాటు (డిసెంబర్ 2028 వరకు) వసూలు చేయనున్నారు.

₹7,635.22 కోట్ల భారానికి ఆమోదం

ఇవి కూడా చదవండి

2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరాల్లో విద్యుత్ సరఫరా కోసం డిస్కంలు చేసిన వాస్తవ వ్యయం, ఇప్పటికే వసూలైన మొత్తాల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని భర్తీ చేయడానికి మొత్తం ₹7,635.22 కోట్ల True-Up Charges రికవరీకి అనుమతినిచ్చారు. ఇందులో వ్యవసాయ పంపుసెట్లకు సంబంధించిన ₹2,214.99 కోట్ల భారాన్ని రైతులపై వేయకుండా, ఆ మొత్తాన్ని తెలంగాణ ప్రభుత్వం నుంచే రికవరీ చేసుకోవాలని డిస్కంలకు TGERC స్పష్టం చేసింది.