Loading Time...
Search
న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ
Install App

అమెరికాలో విదేశీ టెక్కీలకు ట్రంప్ సర్కార్ బిగ్ షాక్

Author
Posted By M TODAY NEWS
| 08 Oct 2026, 10:40 PM | INTERNATIONAL
అమెరికాలో విదేశీ టెక్కీలకు ట్రంప్ సర్కార్ బిగ్ షాక్

ముఖ్యమైన పాయింట్స్:

  • టీసీఎస్, ఇన్ఫోసిస్ సహా 8 దిగ్గజ ఐటీ కంపెనీలపై చర్యలు!

వాషింగ్టన్: అమెరికాలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని భావిస్తున్న విదేశీ టెక్కీలకు, ముఖ్యంగా భారతీయ ఐటీ నిపుణులకు ట్రంప్ యంత్రాంగం మరో భారీ షాక్ ఇచ్చింది. విదేశీ ఉద్యోగులకు శాశ్వత నివాస హోదా కల్పించే ప్రక్రియలో కీలకమైన పర్మనెంట్ లేబర్ సర్టిఫికేషన్ (PLC) ను తాత్కాలికంగా సస్పెండ్ చేస్తూ US Department of Labor సంచలన నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయంగా పేరుపొందిన 8 ప్రముఖ ఐటీ సంస్థలపై ఈ సస్పెన్షన్ వేటు పడగా, ఇందులో భారతీయ ఐటీ దిగ్గజాలైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ కంపెనీలు కూడా ఉన్నాయి.

ఇందుకు సంబంధించిన వివరాలను అమెరికా లేబర్ సెక్రటరీ కీత్ సోండర్ లింగ్ వెల్లడించారు. ఈ కంపెనీలు విదేశీ ఉద్యోగులకు శాశ్వత రెసిడెన్సీని కల్పించే క్రమంలో నిబంధనలను అతిక్రమించాయని, వ్యవస్థను తప్పుదోవ పట్టించాయని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ సంస్థలపై పలు అమెరికన్ ఫెడరల్ ఏజెన్సీలు సమగ్ర దర్యాప్తు జరుపుతున్నాయి.
అమెరికా లేబర్ డిపార్ట్‌మెంట్ నిర్వహిస్తున్న Permanent Labor Certification (PERM) ప్రోగ్రామ్ ద్వారా కంపెనీలు విదేశీ ఉద్యోగులను నియమించుకుని, వారికి శాశ్వత Green Card పొందేందుకు మార్గం సుగమం చేస్తాయి. అయితే, ఈ ప్రక్రియను సదరు ఐటీ సంస్థలు భారీగా దుర్వినియోగం చేశాయని, తద్వారా స్థానిక అమెరికన్లకు దక్కాల్సిన లక్షలాది ఉద్యోగాలు కోల్పోయేలా చేశాయని లేబర్ డిపార్ట్‌మెంట్ నిర్ధారణకు వచ్చింది. చట్టబద్ధమైన వలసలతో పాటు అక్రమ వలసలను కూడా కఠినంగా నిరోధించాలనే ట్రంప్ సర్కార్ వ్యూహంలో భాగంగానే ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే అమెరికా విద్యాసంస్థల్లో చదువు పూర్తి చేసుకుని అక్కడే పని చేయాలనుకునే అంతర్జాతీయ విద్యార్థులపై 70 వేల డాలర్ల ఫీజు ప్రతిపాదన తీసుకొచ్చిన హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం, తాజాగా ఐటీ దిగ్గజాల లేబర్ సర్టిఫికేషన్లను సస్పెండ్ చేయడంతో అమెరికాలోని విదేశీ ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.