Loading Time...
Search
న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ
Install App

సైబర్ మోసం బాధితుడికి ఊరట: ఎస్‌బీఐకి వినియోగదారుల కమిషన్ షాక్!

Author
Posted By M TODAY NEWS
| 10 Oct 2026, 11:12 PM | NATIONAL
సైబర్ మోసం బాధితుడికి ఊరట: ఎస్‌బీఐకి వినియోగదారుల కమిషన్ షాక్!

ముఖ్యమైన పాయింట్స్:

  • ఖాతాదారునికి రూ.1.35 లక్షలు చెల్లించాలని ఆదేశం
  • – కేవైసీ లింక్ మోసంలో మిగిలిన సొమ్ము, నష్టపరిహారంతో సహా ఇవ్వాలని తీర్పు
  • – 45 రోజుల్లోగా చెల్లించకుంటే చర్యలు తప్పవని హెచ్చరిక

తిరువనంతపురం: ఆన్‌లైన్ ఫ్రాడ్ (Cyber Fraud) బాధితుడికి కేరళలోని జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ బిగ్ రిలీఫ్ ఇచ్చింది. సైబర్ మోసానికి గురైన ఒక వినియోగదారునికి రూ.99,874ల మిగిలిన మొత్తంతో పాటు, పరిహారం కింద మరొక రూ.35,000 చెల్లించాలని ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)ను ఆదేశించింది.

కేరళలోని పతనంతిట్టకు చెందిన ఒక దంపతులకు ఎస్‌బీఐలో సేవింగ్స్ ఖాతాతో పాటు రూ.10 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) ఉంది. 2023 జనవరి 7న వారు బ్యాంకింగ్ యాప్ ద్వారా క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లిస్తుండగా లావాదేవీ విఫలమైంది. వెంటనే ‘మీ ఖాతా బ్లాక్ అయ్యిందని, కేవైసీ అప్‌డేట్ చేయాలని’ ఒక మెసేజ్ వచ్చింది. అందులోని లింక్‌ను నమ్మి ఓపెన్ చేయగా, సెకన్లలోనే వారి ఎఫ్‌డీ ఖాతా నుండి రూ.3.28 లక్షలు మాయమయ్యాయి.

వెంటనే స్పందించిన దంపతులు బ్యాంకుకు, బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో రూ.2.24 లక్షలు తిరిగి వచ్చాయి. అయితే మిగిలిన రూ.99,874ల నగదు ఇచ్చేందుకు బ్యాంక్ నిరాకరించడంతో బాధితులు వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు.

ఇవి కూడా చదవండి

బ్యాంక్ వాదనను తోసిపుచ్చిన కమిషన్:

విచారణ సమయంలో కస్టమర్ నిర్లక్ష్యం వల్లే ఓటీపీ, వివరాలు సైబర్ నేరగాళ్లకు వెళ్లాయని ఎస్‌బీఐ వాదించింది. అయితే తన వాదనకు తగిన సాక్ష్యాధారాలు చూపడంలో బ్యాంక్ విఫలమైందని కమిషన్ స్పష్టం చేసింది. కేవలం బాధితులపై నెపం నెట్టివేసి బ్యాంకులు తమ భద్రతా లోపాలు, బాధ్యతల నుంచి తప్పుకోలేవని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
45 రోజుల్లో చెల్లింపులకు ఉత్తర్వులు:

నష్టపోయిన బాధితులకు మిగిలిన Unauthorised Transaction సొమ్ము రూ.99,874తో పాటు, మానసిక వేధింపులకు పరిహారంగా రూ.25,000, కోర్టు ఖర్చుల నిమిత్తం మరో రూ.10,000 కలిపి మొత్తం రూ.1.35 లక్షలు 45 రోజుల్లోగా ఎస్‌బీఐ చెల్లించాలని పతనంతిట్ట వినియోగదారుల కమిషన్ తీర్పు ఇచ్చింది.